కర్నూలులో తొలి పైలట్ శిక్షణ కేంద్రం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో తొలి పైలట్ శిక్షణ కేంద్రం కర్నూలు విమానాశ్రయంలో ఏర్పాటు కానుంది. దీనికోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) ఎండీ వి.ఎన్.భరత్‌రెడ్డి తెలిపారు. ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు మూడు సంస్థలు ముందుకొచ్చాయని, త్వరలోనే ఫైనాన్షియల్ బిడ్లు పిలుస్తామని చెప్పారు. విమానాశ్రయ భూమిని వినియోగించుకునేందుకు ఏపీఏడీసీఎల్‌కు అద్దె చెల్లించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు కర్నూలు విమానాశ్రయాన్ని విజయదశమమికి అందుబాటులోకి తీసుకొస్తామని భరత్‌రెడ్డి తెలిపారు.













