ఐకానిక్ టవర్ కు 22న భూమిపూజ
అమరావతిలో మరో పెద్ద ప్రాజెక్టుకు రంగం సిద్ధమైంది. ఎన్నారైలు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు త్వరలోనే భూమిపూజ జరగనున్నది. అమరావతిలో జూన్ 22న ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్‌కు సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. అమరావతిలోని రాయపూడి గ్రామంలోని ప్రభుత్వ సముదాయంలో ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు కుటుంబ సమేతంగా పాల్గొనాలని ఎన్ఆర్టీ ప్రతినిధులు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఏపీ అభివ ద్ధికి పాటు పడుతున్న ఎన్ఆర్టీ.. నూతన రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ నిర్మించాలని దాదాపు రెండేళ్లుగా ప్రయత్నిస్తోంది. అయితే కొన్ని అడ్డకుంలు ఏర్పడినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతో వాటిని అధిగమించి ఇప్పుడు ఐకానిక్ టవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోంది. విదేశీ హంగులతో, అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోయే ఈ ఐకానిక్ టవర్ అమరావతికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.













