ఏపీలో మరో ఆరు మెగా ప్రాజెక్టులు
రాష్ట్రంలో మరో ఆరు భారీ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదశ్ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ( ఏపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు) ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ సమేవేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం రూ.3,808 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న ఆరు పెద్ద కంపెనీలకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 5,235 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కేసీపీ లిమిటెడ్, చెట్టినాడ్ సిమెంట్, రెయిన్గ్రూప్, మోహన్ స్పిన్టెక్స్ ఇండియా, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్, విశ్వ అపెరల్స్ తదితర సంస్థలు ఈ మెగా ప్రాజెక్టులను నెలకొల్పుతున్నాయి.













