ఏపీలో తగ్గిన కరోనా కేసులు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సెంకడ్ వేవ్ వణికించింది. కరోనా కేసులతో పాటు మరణాలు కూడా భయపెట్టాయి. అయితే ఇప్పుడిప్పుడే వైరస్ ఉధృతి రాష్ట్రంలో తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో 79,564 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 13,756 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16,71,742కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 104 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 10,738 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో 1,73,622 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి 14,87,382 మంది రికవరీ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 20 మంది, చిత్తూరులో 13 మంది, విశాఖపట్నంలో 10, అనంతపురం, తూర్పు గోదావరిలో 9 మంది, గుంటూరు, కృష్ణాలో 8 మంది, కర్నూలులో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, కడపలో ఇద్దరు, ప్రకాశంలో ఒకరి చొప్పున మరణించారు.