ఏపీలో కొత్తగా 11,303 కేసులు… 104 మంది

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత కొంత మేర తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 93,704 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11,303 కరోనా పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. 104 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‍ను విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి నుండి 18,257 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 15,46,617 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,46,737 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 1,93,50,008 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాల్లో 20 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 14 మంది, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో 9 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 8 మంది, విశాఖ జిల్లాలో ఏడుగురు, కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఆరుగురు, కపడ జిల్లాలో 5, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,00,17,712 మంది కొవిడ్ వ్యాక్సిన్ అందించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 74,92,944 మందికి మొదటి డోసు.. 25,24,768 మంది రెండో డోసు తీసుకున్నారు.