ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదు. తాడోపేడో తేల్చుకుంటాం
ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదు, తాడోపేడో తేల్చుకుంటాం అని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌రావు అన్నారు. గుంటూరులో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం సమావేశమైంది. ఇందులో పాల్గొన్న బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆస్పత్రి వెళ్లేందుకు హెల్త్ కార్డులు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రూ.కోట్ల వైద్య బిబ్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండేళ్లు గడిచినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. గత నెలలోనే పీఆర్సీ అమలు చేయాలని సజ్జల చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. సీఎం జగన్ జోక్యం చేసుకొని వెంటనే పీఆర్సీ అమలు చేయాలన్నారు. నెలాఖరులోగా పీఆర్సీ అమలు కాకపోతే ఈ నెల 27, 28 తేదీల్లో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.













