ఏపీకి చంద్రబాబే బ్రాండ్ అంబాడిసర్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని, ఆయనపై నమ్మకంతోనే రాష్ట్రానికి పెద్దఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఏపీలో అభివృద్ధి, సంక్షేమంతోపాటు పారిశ్రామిక, ఉద్యోగ, ఉపాధి రంగాల ముందంజకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని పలు అంశాలు ఉదహరించారు. ఐటీ రంగంలో 36 వేల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించామన్నారు. కియా మోటార్స్ సహా అపోలో టైర్స్, ఏషియన్ పెయింట్స్ తదితర పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని అన్నారు.













