సీఎం హోదాలో జగన్ ఎప్పుడైనా స్టీల్‌ప్లాంట్‌కు వెళ్లారా? :హోం మంత్రి అనిత
స్టీల్‌ప్లాంట్ (Steel Plant) అనే పదం పలికేందుకు కూడా జగన్ (Jagan)కు అర్హత లేదని రాష్ట్ర హోం మంత్రి అనిత (Anita ) అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన కార్మికులను వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనిత మీడియాతో మాట్లాడుతూ జగన్ ఆస్పత్రికి వచ్చినా ఆయన పార్టీ కార్యకర్తలు ఏవేవో నినాదాలు చేశారని విమర్శించారు. సీఎం (CM) హోదాలో జగన్ ఎప్పుడైనా స్టీల్‌ప్లాంట్‌కు వెళ్లారా? అక్కడి కార్మికుల సమస్యల గురించి మాట్లాడారా? మృతుల కుటుంబాలకు స్టీల్‌ప్లాంట్, కేంద్ర, రాష్ట్రం పరిహారం ఇచ్చాయి. మృతుల కుటుంబాలకు రూ.కోటి కంటే ఎక్కువ పరిహారం అందుతుంది. చనిపోయిన ఒప్పంద కార్మికుల కుటుంబానికి కూడా పరిహారం, ఉద్యోగం (Job) ఇస్తున్నాం. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయంగా విమర్శలు సరికాదు అని అన్నారు.








