పొట్ట కుడివైపు నొప్పి, అజీర్ణం, వాంతుల వంటి సమస్యలకు పిత్తాశయ రాళ్లు కారణం కావచ్చు. సరైన ఆహారం తీసుకుంటే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
పొట్ట కుడివైపు నొప్పి, అజీర్ణం, వాంతుల వంటి సమస్యలకు పిత్తాశయ రాళ్లు కారణం కావచ్చు. సరైన ఆహారం తీసుకుంటే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
నిమ్మ, నారింజ, కీవి వంటి సిట్రస్ పండ్లలోని విటమిన్-సి, కొలెస్ట్రాల్‌ను సులభంగా కరిగించి పిత్తాశయాన్ని సురక్షితంగా ఉంచుతుంది.
ఆలివ్ ఆయిల్, అవకాడోలలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ మంచి కొవ్వులు పిత్తాశయం సరిగ్గా సంకోచించి, పిత్త రసం నిల్వ ఉండకుండా చేస్తాయి.
రోజువారీ ఆహారంలో గుప్పెడు జీడిపప్పు, బాదం లేదా వేరుశనగలు చేర్చుకోవడం వల్ల పిత్తాశయ వ్యాధుల ముప్పు చాలా వరకు తగ్గుతుంది.
పాలకూర, బ్రోకోలి, టమాటాల్లో ఉండే మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పిత్తాశయంలో కొలెస్ట్రాల్ గడ్డకట్టకుండా కాపాడతాయి.
మాంసాహార ప్రోటీన్ల కంటే బఠానీలు, పప్పుధాన్యాలు, సోయా వంటి ప్లాంట్ ప్రోటీన్లు పిత్తాశయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
పరిశోధనల ప్రకారం రోజుకు ఒక కప్పు కాఫీ తాగడం వల్ల పిత్తాశయ కదలికలు మెరుగై, రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుందని తేలింది.
రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగడం వల్ల పిత్త రసం చిక్కబడకుండా పల్చగా ఉంటుంది. ఇది రాళ్ల ఏర్పాటును నేరుగా నిరోధిస్తుంది.
వేపుడు పదార్థాలు, అధిక కొవ్వు ఆహారం, వైట్ బ్రెడ్, మైదా, స్వీట్లు, శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం రాళ్ల ప్రమాదాన్ని పెంచవచ్చు.