బాధితులను పరామర్శించడంలో తప్పు లేదు .. కానీ : మంత్రి లోకేశ్
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కును రెండు సార్లు కాపాడిన చరిత్ర తమదని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు (Visakha Steel)ను విధ్వంసం చేసిన అక్కడ రాజధాని నిర్మాణం పేరుతో భూములు కొట్టేయాలని జగన్ (Jagan) ప్రయత్నించారని ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ వల్ల కాలుష్యం అంటూ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడాలని చూసిన ఆయన, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బాధితులను పరామర్శించడంలో తప్పు లేదు. కానీ , స్టీల్ ప్లాంట్ లేకుండా చేయ్యాలని కుట్ర పన్నిన ఆయన అదే విశాఖలో కార్మికులకు క్షమాపణ చెప్పి బెంగళూరు (Bengaluru) వెళ్లాలని హితవు పలికారు.








