9th June 2026

__________

- Saidulu

ఈవెనింగ్ టైమ్‌ను ప్రత్యేక సందర్భంగా మార్చే పొటాటో హార్ట్స్ స్నాక్

ఇంటివద్దే తక్కువ సమయంలో స్పైసీ మరియు కరకరలాడే పొటాటో హార్ట్స్ స్నాక్స్  ఎలా చేయాలో చూద్దాం!

ఉడికించిన ఆలూ, కార్న్‌ఫ్లోర్, కారం, చాట్ మసాలా, ఉప్పు మరియు వేయించడానికి సరిపడా నూనె సిద్ధం చేసుకోండి. 

కావలసినవి

ముందుగా ఉడికించిన బంగాళాదుంపల పొట్టు తీసి, ముక్కలు లేకుండా మెత్తగా మ్యాష్ చేసి ఒక బౌల్‌లో పెట్టుకోండి. 

ఆలూ మ్యాష్

మ్యాష్ చేసిన ఆలూలో కారం, చాట్ మసాలా, గరం మసాలా మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి

మసాలాలు

మిశ్రమం క్రిస్పీగా రావడం కోసం 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసి, చపాతీ పిండిలా ముద్దగా కలుపుకోండి.

క్రిస్పీ సీక్రెట్

ఆ ఆలూ ముద్దను మందంగా ఒత్తుకుని, హార్ట్ షేప్ కట్టర్‌తో అందమైన హార్ట్ ఆకారాలుగా కట్ చేసుకోండి. 

హార్ట్ షేప్స్

కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి, మీడియం ఫ్లేమ్‌పై బాగా వేడి చేయండి. 

నూనె వేడి చేయండి

కట్ చేసిన పొటాటో హార్ట్స్ ముక్కలను జాగ్రత్తగా నూనెలో వేసి మీడియం ఫ్లేమ్‌లో వేయించండి. 

డీప్ ఫ్రై

ముక్కలు రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ మరియు క్రిస్పీగా మారే వరకు వేయించి తీసేయండి.

గోల్డెన్ కలర్

బాగా వేగిన క్రిస్పీ హార్ట్స్‌ను ప్లేట్ లోకి తీసుకోండి. వేడివేడి స్పైసీ పొటాటో హార్ట్స్ రెడీ!

సర్వింగ్

 ఈ  క్రిస్పీ పొటాటో హార్ట్స్‌ను టొమాటో కెచప్‌తో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!

బెస్ట్ కాంబినేషన్