Mohan Babu: మోహన్‌బాబు విశ్వవిద్యాలయానికి జరిమానా

తిరుపతిలోని నటుడు మంచు మోహన్ బాబు (Mohan Babu) యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది. గత మూడేళ్ల నుంచి విద్యార్థుల నుంచి ఫీజుల రూపేణా రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మోహన్ బాబు యూనివర్సిటీ (University) పై విచారణ జరిపింది ఉన్నత విద్యా కమిషన్. విచారణ జరిపి నిజమేనని నిర్ధారించింది. అనంతరం మోహన్ బాబు యూనివర్సిటీకి రూ.15 లక్షల జరిమానా విధించింది ఉన్నత విద్యా కమిషన్ (Higher Education Commission) . విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26 కోట్ల రూపాయలను 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రూ.15 లక్షలు జరిమానాని మోహన్ బాబు యూనివర్సిటీ చెల్లించింది. యూనివర్సిటీ గుర్తింపుని రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వాని (AP government)కి సిఫారసు చేసింది ఉన్నత విద్యా కమిషన్.