నూతన న్యాయమూర్తులకు ఘనంగా సన్మానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు నూతన న్యాయమూర్తులుగా నియమితులైన ఐదుగురిని హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సంఘం కార్యవర్గ సభ్యులు, సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ చేతుల మీదుగా కొత్త న్యాయమూర్తులను సన్మానించారు. వారికి విజయవాడ కనకదుర్గ అమ్మవారి చిత్రపటాలను బహూకరించారు. న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ నూనెపల్లి హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్ సన్మానం అందుకున్న వారిలో ఉన్నారు.













