ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారు. చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలి. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మ అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ఉండాలి అని జగన్ ఆకాంక్షించారు.













