అమెరికా వెళ్లేందుకు నారాయణకు అనుమతి
రాజధాని అమరాతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్‌లో అక్రమాలంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దంటూ ముందస్తు బెయిల్ మంజూరు సందర్భంగా మాజీ మంత్రి నారాయణకు విధించిన షరతును హైకోర్టు సడలించింది. వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు అనుమతిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర శస్త్రచికిత్స నిమిత్తం అమెరికా వెళ్లాల్సి ఉందని, షరతను సడలించాలని కోరుతూ నారాయణ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి బెయిలు షరతులను సడలించారు.













