సినీనటుడు మురళీ మోహన్ కు భారీ షాక్

ప్రముఖ సినీనటుడు, మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత మాగంటి మురళీమోహన్‍కు చెందిన జయభేరి కన్‍స్ట్రక్షన్స్ సంస్థకు ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి పరిధిలో జాతీయ రహదారి పక్కనున్న 7.5 ఎకరాల్లో జయభేరి సంస్థ భవనాలు నిర్మించింది. అయితే ఈ నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ రూ.1.44 కోట్ల జరిమానా విధించారు. దీనిపై తాడేపల్లి తహసీల్దార్ వాకా శ్రీనివాస్‍రెడ్డి మాట్లాడుతూ 2016లో కంచనపల్లి పరిధిలో జయభేరి సంస్థ వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. అయితే దీనిని వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ చేయకుండా, భారీ నిర్మాణాలను చేపట్టారు. దీంతో జరిమానా విధించడంతో పాటు 3 శాతం లాండ్ కన్వర్షన్ ఫీజు చెల్లించాలని ఆదేశించడంతో సంస్థ ప్రతినిధులు చెల్లించారు అని తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను, టీడీపీ నాయకులు సాగిస్తున్న వ్యాపారాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టిన ఏపీ సర్కార్ ఎక్కడికక్కడ వారిపై ఉక్కుపాదం మోపే పనిలో ఉంది.