Village Clinics: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు (Village Clinics) ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రూ.1,129 కోట్లతో సొంత భవనాలను నిర్మించ తలపెట్టింది. ఏడాది వ్యవధిలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి సత్యకుమార్ (Satyakumar) అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులకు అవసరమయ్యే మొత్తం ఖర్చులో 80 శాతం కేంద్రమే భరిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో మరో 1,379 నూతన భవనాల (New buildings ) ను రూ.753 కోట్లతో నిర్మించాల్సి ఉందన్నారు. వీటిని 16వ ఆర్థిక సంఘం (16th Finance Commission) నిధులతో చేపట్టేందుకు ప్రతిపాదనలు ( Proposals) సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు.