సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సహాయం
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సాయితేజ సభ్యులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 లక్షల రూపాయల చెక్‌ను సాయి తేజ కుటుంబ సభ్యులకు అందజేశారు. డిసెంబర్ 8న తమిళనాడు కూనూర్ వద్ద చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులతో పాటు మృతి చెందిన వారిలో సాయి తేజ కూడా ఉన్నారు. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా సాయి తేజ భౌతికకాయాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం సాయితేజ ఆస్పత్రిలో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి మిలటరీ లాంఛనాలతో సాయితేజ స్వస్థలానికి భౌతికకాయాన్ని తరలించారు.













