ఆ నలుగురు ఎమ్మెల్సీలకు.. గవర్నర్ ఓకే
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. దీంతో కొత్తగా లేళ్ల అప్పిరెడ్డి, ఆర్వీ రమేష్ కుమార్, మోషేన్‌రాజు , తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్నారు. వీరితో కలుపుకుంటే శాసనమండలిలో వైఎస్సార్సీపీ బలం 18కి పెరుగుతుంది. అంతుకు ముందు మండలిలో ఖాళీ అయిన స్థానాలకు వివిధ రంగాల్లో అనుభవం ప్రాతిపదికగా ప్రభుత్వం నలుగురు పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసింది. తమ నియామకానికి తోడ్పడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, గవర్నర్‌కు కొత్త ఎమ్మెల్సీలు కృతజ్ఞతలు తెలిపారు.













