Janaganana: జనగణనకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనగణన (Janagaṇana) చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జనగణన నోటిఫికేషన్ (Notification) ను తిరిగి ప్రచురించింది. 2027లో దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికోసం ఈ ఏడాది జూన్ 16న కేంద్రహోంశాఖ (Union Home Ministry) నోటిఫికేషన్ ఇచ్చింది. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం కానుంది. రాష్ట్రంలోనూ అదే రోజు ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ (S.S. Rawat) ఆదేశాలు జారీ చేశారు.













