అధికారులు అప్రమత్తంగా ఉండాలి : పవన్ కల్యాణ్
అర్నబ్ తుపాను (Arnab cyclone ) దృష్ట్యా అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆదేశించారు. తుపాను సన్నద్ధతపై పంచాయతీరాజ్ (Panchayati Raj) గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరాశాఖల అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ప్రజల ప్రాణ రక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.








