ఆమె పార్టీ జగన్ కు అనుకూలం కాదు… వ్యతిరేకమూ కాదు
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఆలోచన పూర్తిగా ఆమె వ్యక్తిగతమని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆ రాష్ట్రంలో సమర్థ నాయకత్వం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణదాస్ మాట్లాడారు. తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులకు అండగా నిలవాల్సిన అవసరముందని చెప్పారు. షర్మిల రాజకీయ ప్రవేశాన్ని తాము తప్పుబట్టడం లేదన్నారు. ఆమె పార్టీ జగన్కు అనుకూలం కాదు.. వ్యతిరేకమూ కాదని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారని, ఆ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఇప్పటికే ప్రధానికి సీఎం లేఖ రాసినట్లు తెలిపారు.













