వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా వరద ప్రభావితా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ అధికారులతో కలిసి ఏరియల్ స్వే నిర్వహించారు. రేణిగుంట, కడప విమానాశ్రయాల్లో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆయా విమానాశ్రయాల్లో ఫొటో గ్యాలరీలను పరిశీలించారు. వరద పరిస్థితులపై అధికారులకు దిశానిర్ధేశం చేసిన ముఖ్యమంత్రి బాధితులను త్వరితగతిన ఆదుకోవాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన తర్వాత సీఎం జగన్ తిరుగు పయనమయ్యారు.













