సీఎం జగన్ అమెరికా పర్యటన ఖరారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 17 నుంచి 23 వరకూ వారం రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ఆయన విదేశీ పర్యటనకు కుటుంబ సభ్యులతో కలసి వెళ్తున్నారు. తన చిన్న కుమార్తె వర్షారెడ్డిని అక్కడ ఉన్నత విద్యలో చేర్పించనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆగస్టు 17న నార్త్ అమెరికా తెలుగు కమ్యూనిటీ సభలోనూ, డల్లాస్లో ప్రవాస భారతీయులు నిర్వహించే సభలోనూ జగన్ పాల్గొంటారు. అమెరికా నుంచి ఆగస్టు 24వ తేదీన ముఖ్యమంత్రి జగన్ స్వదేశానికి తిరిగి వస్తారు.













