వారికి మరో అవకాశం కల్పించాం : వైఎస్ జగన్
వైసీపీ ప్రభుత్వం ప్రజలపై అజమాయిషీ చేసే సర్కారు కాదని, మమకారం చేసే ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలతో గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మే వరకు అమలైన సంక్షేమ పథకాల్లో లబ్ది పొందని వారికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 3,39,096 మంది బల్ధిదారులకు రూ.137 కోట్ల నిధులను సీఎం విడుదల చేసింది. అనంతరం సీఎం మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికోసం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారు దరఖాస్తు చేస్తే, అర్హతను పరిశీలించి ఏటా రెండు సార్లు లబ్ది చేకూర్చుతామని వెల్లడిరచారు.
వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద కొత్తగా 2,99,085 మందికి లబ్దిదారులను ఎంపిక చేశాం. కొత్తగా 7,051 బియ్యం కార్డులు, 3,035 ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేశామన్నారు. 67 వేల మంది రైతు కుటుంబాలకు ఇన్పుట్ సబ్సిడీ సహా 12 పథకాలకు సంబంధించి పథకాలు అందని వారికి లబ్ధి చేకూర్చుతున్నామన్నారు. వివిధ కారణాల వల్ల పథకాలు అందుకోలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించామన్నారు. అర్హత ఉన్నప్పటికీ పథకాలు అందని వారు ఎక్కడా ఉండకూడదన్నారు. అర్హత ఉండి కూడా లబ్ధి పొందకపోతే మరోసారి దరఖాస్తు చేసుకుంటే ఏటా జులై, డిసెంబర్లో లబ్ధి చేకూర్చుతామన్నారు. అర్హత ఒక్కటే ప్రాతిపదికగా తీసుకుని సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వ పాలనకు తేడాను ప్రజలు గమనించాలని అన్నారు.













