పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా స్పిల్వే, లోయర్ కాపర్ డ్యామ్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు 59.6 శాతం పూర్తి. ఈ నెల 24 నాటికి లోయర్ కాపర్ డ్యామ్ జెట్ గ్రౌంటింగ్ పనులు పూర్తి. డిసెంబర్ నుంచి గేట్లు ఏర్పాటు చేసే పనులు ప్రారంభిస్తాం. రూ.9870 కోట్లకు సంబంధించి కేంద్రానికి నివేదికలు ఇచ్చాం. కృష్ణా డెల్టాకు ఈ సీజన్లో 73 టీఎంసీల నీరు మళ్లించాం. వచ్చే మే నాటికి కుడి, ఎడమ కాల్వల ద్వారా నీరందిస్తాం అని అన్నారు. నదుల అనుసంధానం ద్వారా పవ్రిత సంగమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. నీటి భద్రత అనేది ప్రభుత్వ విధానమని, పట్టిసీమ రాకపోతే కృష్ణా డెల్టా ఎండిపోయేదన్నార. తిత్లి తుపాను సహాయ చర్యల్లో కొందరు ఇబ్బంది పెట్టారని, బాధితులకు అన్నిరకాల ఆర్థికసాయం సత్వరమే అందించామని తెలిపారు.













