పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రంవాల్ పూర్తయిన సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పోలవరం ఏపీ ప్రజల జీవనాడి అని అన్నారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలవరం నిర్మాణంలో డయాఫ్రంవాల్ పూర్తిచేయడం ఓ చరిత్ర అని అన్నారు. పోలవరం పూర్తయితే 7 లక్షల ఎకరాలకు నీరుందుతుంది. ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేస్తాం. దేశంలో రెండు నదులను అనుసంధానం చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే. త్వరలోనే వంశధార, నాగావళి, పెన్నా, గోదావరి నదులను అనుసంధానం చేస్తాం. నదుల అనుసంధానంతో నీటి కరువును పారదోలాలి. వర్షపు నీటిని భూగర్భ జలంగా మార్చుకోవాలని అని అన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు తనకు సోమవారం పోలవారమేనని అన్నారు. పోలవరం పూర్తిచేయడం తన జీవితాశయమని సృష్టం చేశారు.













