ఈ నెల 20న సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష
ధర్మపోరాట దీక్ష పేరుతో ఈ నెల 20న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరశన దీక్ష చేయనున్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల తరపున ఈ దీక్ష చేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే దీక్ష సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని, ఆ రోజంతా నిరాహారంతో దీక్ష కొనసాగించి నిరసన తెలియజేయాలని ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పుట్టినరోజున ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రం కోసం నిరశన దీక్ష చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై 30న నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో తిరుపతిలో బహిరంగ సభ జరగనుంది.













