Surya Charisma: సూర్య చరిష్మాకు సీఎం చంద్రబాబు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాడ్మింటన్ క్రీడాకారిణి సూర్య చరిష్మా (Surya Charisma)కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అభినందనలు తెలిపారు. 87వ యోనెక్స్ సన్రైజ్ సీనియర్ నేషనల్ బాడ్మింటన్ చాంపియన్ షిప్ లో సూర్య చరిష్మా బంగారు పతకం (Gold medal) సాధించారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన మహిళా తొలిసారి బంగారుపతకం సాధించడం అద్భుతమైన విషయమని సీఎం పేర్కొన్నారు. అలాగే సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో వెండి పతకం సాధించడం పట్ల కూడా చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.






