Chandrababu :ఏపీ చాలా నష్టపోయింది.. గట్టెక్కించాలి : చంద్రబాబు
16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా(Arvind Panagadia) తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) భేటీ అయ్యారు. ఢిల్లీ లో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ఐదేళ్ల పరిణామాలను పనగడియా దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో రంగాల వారీగా జరిగిన నష్టంపై సీఎం ప్రజంటేషన్ (Presentation) ఇచ్చారు. 2019-24 మధ్య జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఆయన వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీకి తక్కువ జీడీపీ(GDP) ఉంది. ఐదేళ్ల దుష్పరిపాలనతో రాష్ట్రం చాలా నష్టపోయింది. ఏపీ ఆర్థిక స్థితి దారుణంగా ఉందని, అప్పులు తిరిగి చెల్లించే స్థితిలో లేదని నీతిఆయోగ్ (NITI Aayog) చెప్పింది. గత ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. రూ.లక్షన్నర కోట్లకు పైగా బిల్లులు పెండిరగ్లో పెట్టారు. ఆర్థికంగా గట్టెక్కించే చర్యలకు సహకరించాలి అని అరవింద్ పనగడియాను చంద్రబాబు కోరారు.













