సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తన ఏమాత్రం బాగాలేదు.. మండిపడ్డ ప్రభుత్వ చీఫ్ విప్
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తన ఏమాత్రం బాగలేదని, వాళ్ళు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ ప్రసాద్ రాజు మండిపడ్డారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే సభ జరుగుతుందని ఆయన వెల్లడించారు. సభలో నుంచి ఎప్పుడెప్పుడు వెల్లిపోదామా? అని ప్రతిపక్ష సభ్యులు ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. సభలో అనుచితంగా ప్రవర్తించి సస్పెండ్ చేయించుకోడమే వాళ్లకు కావలసింది అని అన్నారు. సభను ప్రతీ విషయంలో తప్పుదోవ పట్టించడానికి ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఫైర్ అయిన ప్రసాద్ రాజు.. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ చర్చించేందుకు టీడీపీ నాయకులు వణికిపోతున్నారు అని విమర్శించారు. ఏమాత్రం సబ్జెక్ట్ లేకుండా సభకు వస్తున్నారన్నారని, సభకు రావడం వాళ్లకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబు బలవంతంగా తమ ఎమ్మెల్యేలను సభకు పంపుతున్నట్లు కనిపిస్తోందని ప్రసాద్ రాజు అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేతలు సభకు వచ్చి ప్రతిపక్షం చర్చలో పాల్గొనాలని తాను కోరుతున్నానని, అన్ని అంశాలపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయటం టీడీపీ నేతలు మానుకోవాలని మానుకోవాలని ప్రసాద్ రాజు సూచించారు.













