ఈ నెల 31న మంత్రిమండలి సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి ఈ నెల 31న సమావేశం కానుంది. ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీనిపై చర్చించేందుకు, సమావేశాల్లో ప్రవేశపెట్టి బిల్లుకు ఆమోదం తెలిపేందుకు మంత్రిమండలి సమావేశం అవ్వనుంది. ఈ రోజే మంత్రిమండలి బడ్జెట్ను ఆమోదించేస్తే ఈ ప్రభుత్వంలో 31న జరిగేది చివరి భేటీ కానుంది. లేకపోతే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేరోజు ఆమోదం తెలిపిందుకు అదే రోజు ఉదయాన మరోసారి మంత్రిమండలి సమావేశమవుతుంది.













