11న ఏపీ మంత్రివర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. సచివాయంలోని మొదటి బ్లాక్‌లో 11వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని జారీ చేసిన ప్రత్యేక నోట్‌లో పేర్కొన్నారు. కేబినెట్ సమావేశానికి తీసుకువెళ్లాల్సిన అంశాలకు చెందిన ప్రతిపాదనలను 8న మధ్యాహ్నం 12 గంటల్లోపు సాధారణ పరిపాలన శాఖ కేబినెట్ విభాగానికి పంపాలని అన్ని శాఖలను ఆదేశించారు.