ఏపీ క్యాబినెట్ భేటీ… పలు కీలక అంశాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకుంది. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. అజెండాలోని అన్ని అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ కల్యాణమస్తు పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. జెఎస్ డబ్ల్యూ సంస్థకు మారిటెమ్ ద్వారా 250 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రధానంగా 70 అజెండా అంశాలపై క్యాబినెట్ చర్చించింది.













