విదేశాలకు వెళ్లే వారికి టీకా…

ఉద్యోగాలు, చదువుల నిమిత్తం విదేశాలకు (18 నుంచి 44 ఏళ్ల మధ్య) వెళ్లే వారికి టీకా వేయాలని ఆంధప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. లబ్ధిదారులు చూపించిన ఆధారాలు సంతృప్తికరంగా ఉంటేనే వ్యాక్సినేషన్ కేంద్రం బాధ్యులు టీకా వేయాలని పేర్కొన్నారు. టీకా ఎంపికలో ఛాయిస్ ఇవ్వొద్దని స్పష్టం చేశారు.