ఏపీలో బాధ్యతలు స్వీకరించిన కొత్త మంత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మంత్రి మండలి కొలువు దీరిన సంగతి తెలిసిందే. పలువురు మంత్రులు ఆ శాఖల బాధ్యతల్ని స్వీకరించారు. సచివాలయంలో 2వ బ్లాక్లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పూజలు నిర్వహించి, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే విద్యాశాఖ మంత్రిగా నియమితులైన బొత్స సత్యనారాయణ కూడా ఆ శాఖ బాధ్యతల్ని స్వీకరించారు. అదే విధంగా గనులు, విద్యుత్, అటవీశాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యతలు చేపట్టారు. అంతకముందు సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి పెద్దిరెడ్డి దంపతులు, ఎంపీ మిథన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పినిపే విశ్వరూప్ సచివాయంలో బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు.













