చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం జగన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ మేరకు జగన్ ట్వీట్ చేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని ఇలాంటి జన్మదినే వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ట్విటర్లో పేర్కొన్నారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల ఆ పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టాయి. నేతలు, కార్యకర్తలు పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా తమ అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు.













