25న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. ఆయా శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల 24వ తేదీ సాయంత్రంలోగా పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆయా శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేసారు. కాగా సమావేశంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినేన్స్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనంతరం శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.













