అమరావతి శాసన రాజధాని కూడా కాబోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంలో కొత్త ట్విస్టు. ఓ వైపు 3 రాజధానులు సమ్మతం కాదని అమరావతి ని ఏకైక రాజధాని గా కొనసాగించాలని ఉద్యమం నడుస్తోంది. దీనికి మరోవైపు అసలు అమరావతి ని శాసన రాజధాని గా కూడా అంగీకరించేది లేదంటూ కొత్త స్వరాలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు ప్రభుత్వం లోని పెద్దలే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తుండడం తో రాష్ట్రంలో కొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి కొన్నిరోజుల క్రితమే ఇళ్ల పట్టాల అంశంపై మాట్లాడుతూ అమరావతి కి శాసన రాజధాని హోదా కూడా వద్దని సంచలనాత్మక డిమాండ్ చేశారు మంత్రి కొడాలి నాని. తాజాగా కూడా ఆయన మంగళవారం మరోసారి అదే తరహాలో తన డిమాండ్ వినిపించారు.
అయితే ఈసారి మరింత స్పష్టంగా. అమరావతి శాసన రాజధాని గా వద్దని ఈ విషయం ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దీనిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని జగన్ చెప్పారన్నారు.తాజా ప్రకటన లో కొడాలి నాని సీఎం జగన్ ను కూడా జత చేయడం విశేషం. దీనితో అమరావతి ప్రాంతంలో ఎలాంటి స్పందన వస్తోందో వేచి చూడాల్సి ఉంది













