Kollu Ravindra: ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం : మంత్రి కొల్లు రవీంద్ర
ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) స్పష్టంచేశారు. మచిలీపట్నం (Machilipatnam)లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ, పింఛన్లు, ఇంటి స్థలాల అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. ప్రజలు చెప్పే ప్రతి సమస్యకూ పరిష్కారం చూపిస్తామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన కాలనీల్లో మౌలిక వసతులు లేక అవస్థలు పడ్డారని తెలిపారు. పేదలకు గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తున్నామని వెల్లడిరచారు. బందరు (Bandar) లో పర్యాటకాభివృద్ధికి మైరా, పోస్ట్‌కార్డ్ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. గోవా (Goa) నుంచి షిప్ తయారీ పరిశ్రమ, ఇతర దేశాల సంస్థలు ముందుకొచ్చినట్లు పేర్కొన్నారు. అన్నింటికీ త్వరలో భూములు కేటాయించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.






