విజయ డెయిరీ నూతన చైర్మన్గా దాసరి బాలవర్ధనరావు
కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి విజయ డెయిరీ ( Vijaya Dairy) నూతన చైర్మన్ దాసరి వెంకట బాలవర్ధనరావు (Dasari Venkata Balavardhana Rao) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల చలసాని ఆంజనేయులు (Chalasani Anjaneyulu) డైయిరీ చైర్మన్ పదవితోపాటు డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో డెయిరీ నూతన చైర్మన్ ఎన్నిక విషయంలో అనేక ఊహాగానాలు తలెత్తాయి. వీటన్నింటినీ తోసిపుచ్చుతూ రెండు సార్లు శాసనసభ్యునిగా, 15 ఏళ్లుగా పాల సొసైటీ డైరెక్టర్ (Society Director)గా వ్యవహరించిన సీనియర్ తెలుగుదేశం నాయకులు బాలవర్ధనరావుకు చైర్మన్గా అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం భావించింది. విజయ డెయిరీ కార్యాలయం సమావేశమైన డైరెక్టర్లు, బాలవర్దనరావు పేరును సామÖహికంగా ప్రతిపాదిస్తూ ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకున్నారు. అనంతరం నూతన చైర్మన్గా బాలవర్ధనరావు లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు.








