విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి తప్పనిసరి : ఆళ్ల నాని
విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి ఆర్టీ పీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని, ఆర్టీ పీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వస్తేనే క్వారంటైన్‌కు పంపిస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కొవిడ్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయని, అది రాష్ట్రానికి రాకుండా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయని అన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారన్నారు. వచ్చే ఏడాది జనవరి 15 నాటికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు 104 సహా అవసరమైన చర్యల సన్నద్ధతపై చర్చించామన్నారు.
ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్నింటినీ సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ధరించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. దక్షిణాఫ్రికా నుంచి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వస్తోందని కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది. కేంద్రం ముందస్తు హెచ్చరికలు సహా మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. కేంద్రం ఆదేశాలు, సూచనలు తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదన్నారు. కొత్త వేరియంట్‌పై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.













