విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతుల రద్దు..
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తితో పాటు దాని చుట్టూ అల్లుకుంటున్న వివాదాలు కూడా అలాగే వ్యాప్తి చెందుతున్నాయి. తాజాగా విజయవాడలో అన్ని ప్రైవేటు కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విచిత్రం ఏమిటంటే…ఈ సెంటర్లకు అనుమతులు ఇచ్చిన డిఎంహెచ్ వో్ డాక్టర్ రమేష్ నాలుగు రోజుల క్రితమే పదవీ విరమణ పొందారు అనుమతులు ఇచ్చి తిరిగి ఆయనే వీటి అనుమతులు రద్దు చేయడం విశేషం. ప్రైవేటు కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులకు సంబంధించిన లావాదేవీల్లో పలు రకాల అవినీతి చోటు చేసుకున్నట్టు తాజాగా ప్రభుత్వం గుర్తించిందని సమాచారం. దీనికి సంబంధించి రూ.లక్షల్లో చేతులు మారినట్టు గుర్తించారు. అదే సమయంలో వీటి లైసెన్స్లు రద్దు చేస్తూ అనుమతి ఇచ్చిన అధికారే నిర్ణయం తీసుకోవడంతో దుమారం రేగుతోంది. ఇటీవలే విజయవాడలోని స్వర్ణప్యాలెస్ హోటల్లో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది దుర్మరణం పాలవడం పలువురు గాయాల బారిన పడడం తెలిసిందే. ఈ సంఘటన అనంతరమే ప్రభుత్వం ఈ సెంటర్ల ఏర్పాటు వెనుక ఉన్న లొసుగులను కనిపెట్టే పని ప్రారంభించింది.













