Sonu Sood : నటుడు సోనుసూద్‌ను అభినందించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును నటుడు, సూద్ ఛారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోనూసూద్ (Sonu Sood) అమరావతిలోని సచివాలయంలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సోనూసూద్ ఫౌండేషన్ (Sonu Sood Foundation) నాలుగు అంబులెన్స్‌ల(Ambulance)ను అందించింది. ఈ సందర్భంగా చంద్రబాబును కలిసిన సోనూసూద్, ఫౌండేషన్ అంబులెన్సులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. అనంతరం నాలుగు అంబులెన్స్‌లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మర్యాద పూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూదన్ ఈ సందర్భంగా చంద్రబాబు (Chandrababu) అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో సూద్ ఛారిటీ ఫౌండేషన్ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు.













