ఇద్దరూ కప్పు కాఫీ తాగితేనే.. వైసీపీకి వణుకెందుకు ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఒకవైపు ఉంటే, వైసీపీ దోపీడి ముఠా మరోవైపు ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు భేటీ అయితే వైసీపీ ఎందుకు వణుకుతోందని అన్నారు. ఇద్దరు కప్పు కాఫీ తాగితేనే జగన్ ముఠా భయంతో మూడు చెరువుల నీళ్లు తాగుతోందని వ్యాఖ్యానించారు. విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటన సమయంలో ప్రభుత్వం టెర్ర రిజానికి పాల్పడిరదని, ఆనాడు చంద్రబాబు పవన్‌ను కలిసి సంఫీుభావం తెలిపారన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మరోసారి టెర్రరీజానికి ఒడిగట్టిందని, ఈ నేపథ్యంలో పవన్ చంద్రబాబును కలిసి సంఫీుభావ తెలిపారన్నారు. ప్రజా వ్యతిరేక పాలనకు ఈ భేటీ చరమ గీతంగా మారుతుందన్న భయంతోనే వైసీపీలో వణుకు మొదలైందన్నారు. వైసీపీ నేతలు తమ అవలక్షణాలను ఎదుటివారిపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రులు మాట్లాడిన అవాస్తవాలతోనే వైసీపీ ఎంత భయంలో ఉందో స్పష్టమౌతుందని అన్నారు.













