దైర్యం ఉంటే లోకేశ్ సవాల్ ను.. జగన్ స్వీకరించాలి
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ఒక్కరికి కూడా శిక్షణ ఇవ్వలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇడుపులపాయకు వెళ్లి చూసొద్దామా జగన్? అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని లోకేశ్ సవాల్ విసిరారు. ధైర్యం ఉంటే లోకేశ్ సవాల్‌ను జగన్ స్వీకరించాలి. రూ.371 కోట్ల అవినీతి జరిగిందని మీ పార్టీ వాళ్లు చెబుతున్నారు కదా. వెళ్లి తనిఖీ చేద్దాం. నీ విమానంలోనే ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలోని సెంటర్‌కు వెళ్దాం. సాఫ్ట్వేర్ ఉందా? పరికరాలు ఉన్నాయా? లేదా? అనేది ఇద్దరమూ చూద్దాం. ఎంతమంది శిక్షణ పొందారు. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చూద్దాం. కేబినెట్లో తీర్మానం లేకుండా కార్పొరేషన్ పెట్టారని అంటున్నారు. కేబినెట్ ఆమోదం లేకుండా కార్పొరేషన్ పెడతారా? కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలకు ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యతల వహిస్తారా? ఇప్పటికైనా చంద్రబాబుపై కేసులు ఎత్తివేస్తే జగన్‌కు కనీస గౌరవం ఉంటుంది అని అన్నారు.













