మార్చి 5 తర్వాత ఊహించని నిర్ణయాలు
మార్చి 5వ తేదీ తర్వాత ఊహించని నిర్ణయాలు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పాత్రలను మేమే పోషిస్తున్నామన్నారు. అలాగే రాష్ట్ర హక్కుల కోసం మడమ తిప్పకుండా పోరాటా చేస్తామని అన్నారు. రాష్ట్రానికి న్యాయం జరగకపోతే సరైన సమయంలో మేం నిర్ణయం తీసుకుంటామని అన్నారు. విపక్ష నేత జగన్ మరో నాటకానికి తెరతీశారని, ప్రతిపక్ష పాత్ర పోషించే సత్తా జగన్కు లేదని అన్నారు. అలాగే విశ్వసనీయత లేకుండా ఏ నాయకుడు మనుగడ సాధించలేరని అన్నారు.













