ఈ దాడులపై సీఎం సమాధానం చెప్పాలి…

నవ్యాంధప్రదేశ్‍ను వైకాపా ప్రభుత్వం హత్యాంధప్రదేశ్‍గా మార్చిందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో టీడీపీ కార్యకర్తలపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ దాడులపై సీఎం ఏం సమాధానం చెప్పారని నిలదీశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 27 మంది టీడీపీ కార్యక్తలను బలితీసుకుందని అన్నారు. 1400 మందికిపైగా టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగితే పోలీసులకు కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. హత్యలకు కారకులైన ఏ ఒక్కరినైనా శిక్షించారా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు హత్యలతో రక్తపాతం చేస్తూ ఏదో ఒక అల్లరి సృష్టిస్తున్నారని ఆరోపించారు.
పరిశ్రమలతో కలకలలాడాల్సిన రాష్ట్రం, దాడులు, హత్యలతో విలవిల్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భధ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. వైకాపా అరాచకాలపై సీఎం ఏం సమాధానం చెప్పారని అన్నారు. రోజులెప్పుడై ఒకేలా ఉండవని గుర్తించాలని, ఎవరిదో అండ చూసుకొని రెచ్చిపోయే గూండాలు భవిష్యత్‍లో తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు.