మరో 160 రోజుల్లో చంద్రబాబే సీఎం
మరో 160 రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహాశక్తి ప్రచార కార్యక్రమంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కినా లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు పడటం లేదని ఆరోపించారు. మద్య నిషేధం చేస్తానని చెప్పిన జగన్ మాట మార్చారని విమర్శించారు. మహిళలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. 50 రోజుల పాటు మహాశక్తి పథకాలపై పార్టీ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.













