నేడు దేశంలో ఏపీ మొదటి స్థానం :అచ్చెన్నాయుడు

సీఎం జగన్ పాలనలో మహిళలకు అండ అంటే ఇదేనా అని ఫ్యాక్షన్ మనస్తత్వమే వైసీపీ సిద్ధాంతామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. నెల్లూరు కలిగిరి మండలం కుమ్మరకొండూరులో భూ అమ్రకణకు అడ్డుకున్న సుభరత్నమ్మపై వైసీపీ నేత మహేష్ దాడిని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. దాడులు, హత్యలు, దోచుకోవడం, కబ్జాలు దోపిడీలు చేయడమే వైసీపీ నాయకుల ప్రథమ కర్తవ్యమన్నారు. నేడు దేశంలో మహిళలపై భౌతిక దాడుల్లో ఏపీ 1వ స్థానం, లైంగిక వేధింపులో 3 స్థానంలో ఉండటానికి జగన్ రెడ్డే కారణమని మండిపడ్డారు.
మహిళలపై దిశను తీసుకు వచ్చి మేలు చేస్తున్నామని, గొప్పలు చెప్పకునే జగన్ నేడు ఈ దాడులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మూడేళ్లలో వైసీపీ నేతలు దాదాపు 1500 మంది మహిళలపై దాడులు చేసినా ఇంత వరకు ఒక్క వైసీపీ నేతను అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయా అని నిలదీశారు. తాడేపల్లిలో జగన్ ఇంటి సమీపంలో మహిళపై అత్యాచారం చేసిన వెంకటరెడ్డిని ఇంత వరకు ఎందుకు అరెస్టు చేయలేదని అన్నారు. వైసీపీ అధికారమదంతో అచ్చోసిన ఆంబోతుల్లా మహిళలపై అక్రమాలకు పాల్పడానికి కారణం జగన్ కాదా అని ప్రశ్నించారు.











































































